బ్రాహ్మణవాడిలో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-22T06:18:02+05:30 IST

కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

బ్రాహ్మణవాడిలో యువకుడి ఆత్మహత్య

బేగంపేట, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రాహ్మణవాడి లేన్‌ నంబర్‌ 4లో ఓ ఇంట్లో సూర్యప్రతాప్‌(24) తన తల్లి, సోదరితో కలిసి ఉంటున్నాడు. మైత్రి కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం కార్ఖానాలోని చర్చికి అతడి తల్లి, సోదరి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూర్యప్రతాప్‌ ఉరేసుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకు అతడి తల్లి తిరిగి ఇంటికి వచ్చి తలుపు తీయగా సూర్యప్రతాప్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-03-22T06:18:02+05:30 IST