వేరే మహిళతో ఉంటున్నాడని మామను హత్య చేసిన అల్లుడు..!

ABN , First Publish Date - 2021-12-30T17:44:40+05:30 IST

వేరే మహిళతో ఉంటున్నాడని మామను హత్య చేసిన అల్లుడు..!

వేరే మహిళతో ఉంటున్నాడని మామను హత్య చేసిన అల్లుడు..!

హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : వరుసకు మామ అయ్యే వ్యక్తిపై అల్లుడు క్షణికావేశంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీను కుమార్తెతో జగద్గిరిగుట్టలోని పాపిరెడ్డినగర్‌లో నివాసముండే బాలకృష్ణకు వివాహం జరిగింది. బాలకృష్ణ తండ్రి వెంకటేశ్‌ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వారం రోజులుగా ఇంటికి రావడం లేదు. ఈ విషయమై ఇంట్లో రోజూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో శ్రీను సంజయ్‌గాంధీనగర్‌లో నివాసముండే తన తోడల్లుడు ఎన్‌.రాజమౌళి (50) వద్దకు వచ్చాడు. శ్రీను, రాజమౌళి కలిసి వెంకటేశ్‌ ఉన్న చోటు చెప్పడానికి అల్లుడి ఇంటికి వచ్చారు. అందరూ కలిసి ఈ విషయమై చర్చిస్తుండగా బాలకృష్ణ క్షణికావేశంలో రాజమౌళి మెడపై కత్తితో పొడిచాడు. తీవ్రమైన గాయాలైన రాజమౌళిని చింతల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున చనిపోయాడు. జగద్గిరిగుట్ట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బాలకృష్ణను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-30T17:44:40+05:30 IST