కరోనాతో కొడుకు మృతి.. ఆ బెంగతో తండ్రి కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-08T17:46:05+05:30 IST

కరోనా వ్యాధి సోకి కళ్లముందే కన్న కొడుకు చనిపోవడంతో

కరోనాతో కొడుకు మృతి.. ఆ బెంగతో తండ్రి కన్నుమూత

హైదరాబాద్/పాపన్నపేట : కరోనా వ్యాధి సోకి కళ్లముందే కన్న కొడుకు చనిపోవడంతో కలత చెందిన తండ్రి మృత్యువాత పడ్డ సంఘటన మండల పరిధిలోని మల్లంపేటలో జరిగింది. పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేట గ్రామానికి చెందిన కొమ్మ రమేష్‌గుప్తా (39) వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కుమారుడు చనిపోయిన నాటి నుంచి బెంగ పెట్టుకున్న మృతుడి తండ్రి ఈశ్వరయ్య (90) వారం రోజులు గడువకముందే గురువారం రాత్రి మరణించాడు. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకులు మరణించడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగారు. మృతుల కుటుంబాలకు ఎంపీపీ చందనా ప్రశాంత్‌రెడ్డి, సర్పంచ్‌ బాపురెడ్డి, పలువురు గ్రామపెద్దలు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Updated Date - 2021-05-08T17:46:05+05:30 IST