కార్పొరేటర్‌పై మహిళ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-05-05T18:07:11+05:30 IST

సీతాఫల్‌మండి డివిజన్‌ ఎరుకల బస్తీలో సమస్యలను పరిష్కరించటంలేదని స్థానిక మహిళ కార్పొరేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం మధ్యాహ్నం

కార్పొరేటర్‌పై మహిళ ఆగ్రహం

హైదరాబాద్/బౌద్ధనగర్‌: సీతాఫల్‌మండి డివిజన్‌ ఎరుకల బస్తీలో సమస్యలను పరిష్కరించటంలేదని స్థానిక మహిళ కార్పొరేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎరుకల బస్తీకి చెందిన ఓ మహిళ నామాలగుండులోని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు కార్యాలయానికి వెళ్లి కార్పొరేటర్‌ హేమ గురించి అడిగింది. ఆమె లేరని, ఫోన్‌ చేయాలని సిబ్బంది సూచించారు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా కార్పొరేటర్‌ లిఫ్ట్‌ చేయడం లేదని, బస్తీలో మురికినీరు పారుతోందని, మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని కేకలు వేసింది. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారని, సమస్యలను పట్టించుకోవడం లేదని, ఏళ్ల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎరుకల బస్తీలో సమస్యలను పట్టించుకునే నాథుడే లేడంటూ అసభ్యంగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

Updated Date - 2021-05-05T18:07:11+05:30 IST