శిల్పా చౌదరికి 14 రోజుల రిమాండ్
ABN , First Publish Date - 2021-12-15T16:51:26+05:30 IST
ఆర్థికమోసం కేసులో శిల్పా చౌదరి మూడోసారి ఒక రోజు పోలీసు కస్టడీ ముగియడంతో కోర్టు రిమాండ్ విధించింది.

రంగారెడ్డి: ఆర్థికమోసం కేసులో శిల్పా చౌదరి మూడోసారి ఒక రోజు పోలీసు కస్టడీ ముగియడంతో బుధవారం నార్సింగి పోలీసులు గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో శిల్పకు కరోనా పరీక్ష నిర్వహించిన అనంతరం రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు 14 రోజులు రిమాండ్ విధించింది. కాగా మంగళవారం పోలీసుల దర్యాప్తులో భాగంగా కోకాపేట యాక్సిస్ బ్యాంకులో శిల్ప అకౌంట్‌కు సంబంధించి జరిగిన లావాదేవీలను పోలీసులు పరిశీలించారు. శిల్పను పోలీసులు ఇప్పటికే రెండు పర్యాయాలు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయినా కేసు కొలిక్కి రాకపోవడంతో.. తాజాగా మూడోసారి ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతితో శిల్పాచౌదరిని మంగళవారం విచారించారు.