హైదరాబాద్‌లో TRS కు షాక్‌...

ABN , First Publish Date - 2021-09-03T15:00:20+05:30 IST

హైదరాబాద్‌లో TRS కు షాక్‌...

హైదరాబాద్‌లో TRS కు షాక్‌...

హైదరాబాద్ సిటీ/హయత్‌నగర్‌ : తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ, కమ్మగూడలో టీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. మాజీ ఎంపీటీసీ సుజాతామోహన్‌ నాయక్‌, దేశ్యానాయక్‌, రాజు, లచ్చునాయక్‌, శంకర్‌నాయక్‌, దస్రునాయక్‌, రవి, రామునాయక్‌తోపాటు వందమంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గురువారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, సీనియర్‌ నాయకుడు రొక్కం భీంరెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అనేక మంది టీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రె‌స్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ గుండ్లపల్లి హరిత ధన్‌రాజ్‌గౌడ్‌, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కొశిక ఐలయ్య, కౌన్సిలర్‌ సునీల్‌, నాయకులు కుంట గోపాల్‌రెడ్డి, శేఖర్‌గౌడ్‌, చిన్నయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T15:00:20+05:30 IST