శిల్పాచౌదరిని మరో మారు కస్టడికి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్

ABN , First Publish Date - 2021-12-07T17:40:47+05:30 IST

కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని...

శిల్పాచౌదరిని మరో మారు కస్టడికి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్

హైదరాబాద్: కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని మరో మారు కస్టడికి ఇవ్వాలని కోరుతూ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇతర నిందితుల పాత్రపై విచారణ జరపాల్సివుందని, నాలుగు రోజుల కస్టడి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. కిడ్డీ పార్టీల పేరుతో కాజేసిన డబ్బు ఎక్కడికి తరలించారు అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. దీనిపై మంగళవారం వాదనలు జరిగే అవకాశముంది.

Updated Date - 2021-12-07T17:40:47+05:30 IST