జైలు నుంచి విడుదలైన శిల్పాచౌదరి

ABN , First Publish Date - 2021-12-25T15:08:27+05:30 IST

చీటింగ్‌ కేసులో అరెస్టయి చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్‌లో ఉన్న శిల్పా చౌదరి బెయిలుపై విడుదలయ్యారు.

జైలు నుంచి విడుదలైన శిల్పాచౌదరి

చాదర్‌ఘాట్‌, డిసెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): చీటింగ్‌ కేసులో అరెస్టయి చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్‌లో ఉన్న శిల్పా చౌదరి బెయిలుపై విడుదలయ్యారు. ఉప్పర్‌పల్లి కోర్టు గురువారం ఆమెకు షరతులతో కూడిన బెయిలును మంజూరుచేయగా, శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. కుటుంబ సభ్యులు జైలు వద్దకు రాగా, వారి వాహనంలోనే ఆమె వెళ్లిపోయారు. దాదాపు 25 రోజులపాటు జైల్లో ఉన్నారు. నవంబరు 13న శిల్పా చౌదరిపై దివ్యారెడ్డి అనే మహిళ నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నవంబరు 25న శిల్పా చౌదరిని అరెస్టు చేసి 26న రిమాండ్‌కు తరలించారు. పోలీసులు ఆమెను మూడుసార్లు కస్టడీకి తీసుకుని విచారించారు. కొందరు మహిళలకు డబ్బులు తిరిగి ఇచ్చానని, ఓ ఆసుపత్రి నిర్మాణంలో పెట్టుబడి పెట్టానని పోలీసులకు చెప్పారు. హయత్‌నగర్‌లో ప్లాటు, గండిపేటలో ఓ విల్లా ఉన్నాయని, వాటిని అమ్మి తనపై ఫిర్యాదు చేసినవారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని విచారణలో శిల్పా చౌదరి పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-12-25T15:08:27+05:30 IST