సికింద్రాబాద్, తిరుమలగిరిలో ఉద్రిక్తత.. ఐదుగురు వ్యక్తులు టవర్ ఎక్కి నిరసన
ABN , First Publish Date - 2021-12-30T17:56:38+05:30 IST
హైదరాబాద్: సికింద్రాబాద్, తిరుమలగిరిలో ఉద్రిక్తత నెలకొంది.

హైదరాబాద్: సికింద్రాబాద్, తిరుమలగిరిలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తమకు కేటాయించిన ఇళ్లను స్థానిక నేతలు అమ్ముకున్నారంటూ ఐదుగురు వ్యక్తులు హైటెన్షన్ పోల్ ఎక్కి నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని.. కిందికిదిగివస్తే న్యాయం జరిగేలా చూస్తామని చెప్పినప్పటికీ ఆందోళనకారులు వినలేదు. అధికారులు వచ్చి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు కిందికిదిగేదిలేదని తేల్చి చెప్పారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని నిరసకారులు ఆవేదన వ్యక్తం చేశారు.