బహుజనుల నాయకత్వం బలపడాలి : మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌

ABN , First Publish Date - 2021-08-09T06:18:17+05:30 IST

బహుజనుల నాయకత్వం బలపడాల్సిన అవసరం ఉందని, దీనికి అడ్డుపడుతున్న శక్తులను గుర్తించి ఎదుర్కొన్నప్పుడే సర్వాయి పాపన్నగౌడ్‌ ఆత్మ శాంతిస్తుందని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

బహుజనుల నాయకత్వం బలపడాలి : మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి 

రవీంద్రభారతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): బహుజనుల నాయకత్వం బలపడాల్సిన అవసరం ఉందని, దీనికి అడ్డుపడుతున్న శక్తులను గుర్తించి ఎదుర్కొన్నప్పుడే సర్వాయి పాపన్నగౌడ్‌ ఆత్మ శాంతిస్తుందని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జైగౌడ ఉద్యమం- జాతీయ కమిటీ ఆధ్వర్యంలో తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్నగౌడ్‌ మహరాజ్‌ జయంతి జాతీయ వారోత్సవాలు నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.సర్వాయి పాపన్నగౌడ్‌ స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరముందని అన్నారు. బహుజన కులాలను కలుపుకొనివెళ్లాలని సూచించారు. పాపన్నగౌడ్‌ విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ నేత మధుయాష్కీగౌడ్‌ మాట్లాడుతూ.. జాతి అభ్యున్నతికి ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. జై గౌడ ఉద్యమం- జాతీయ కమిటీ అధ్యక్షుడు రామారావుగౌడ్‌ మాట్లాడుతూ.. గౌడజాతి అభివృద్ధి కోసం జై గౌడ ఉద్యమం సంఘం నిరంతరం పనిచేస్తోందన్నారు. ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. జైగౌడ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, రాజేషంగౌడ్‌, అశోక్‌గౌడ్‌, లక్ష్మణ్‌గౌడ్‌, సత్యనారాయణగౌడ్‌, పతాని రామకృష్ణగౌడ్‌, మధు కొంగలప్ప, వంశీ, తిరుమల్‌, కర్ణాటక నుంచి దశ్యంత్‌గౌడ్‌, ఆయా రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.  

Updated Date - 2021-08-09T06:18:17+05:30 IST