ఆర్టీసీకి మంచి శఖం వచ్చింది: Baji reddy

ABN , First Publish Date - 2021-11-01T18:39:27+05:30 IST

ఆర్టీసీకి మంచి శఖం వచ్చిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.

ఆర్టీసీకి మంచి శఖం వచ్చింది: Baji reddy

హైదరాబాద్: ఆర్టీసీకి మంచి శఖం వచ్చిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గతంలో ఈ సంస్థను ఎక్కడ అమ్మేస్తారో... ప్రైవేట్ అవుతుందో అని అనుకున్నారని.. కానీ సీఎం కేసీఆర్ సంస్థను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారని తెలిపారు. సంస్థపై నమ్మకం కలిగించాలన్నారన్నారు. ప్రతి ఏడాది రూ.40కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. మెడికోవర్ మంచి సంస్థ అని ఆ సంస్థ సహకారం చాలా ముఖ్యమైనది చెప్పారు. ఆర్టీసీ ఆసుపత్రికి వచ్చిన వారిని ఏ ఆసుపత్రికి రిఫర్ చేయవద్దన్నారు. ‘‘ప్రభుత్వ ఆర్థిక సహకారమే కాదు...మనం కూడా స్వతహాగా కష్టపడి సంస్థలో లాభాలు తెచ్చుకోవాలి’’ అని ఆయన తెలిపారు. సంస్థను బాగు చేయాలనుకునే వ్యక్తులున్నారు... కాబట్టే సాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-01T18:39:27+05:30 IST