Shamshabad ఎయిర్‌పోర్ట్‌కు కొత్త రూట్లలో ఆర్టీసీ..

ABN , First Publish Date - 2021-10-07T14:56:29+05:30 IST

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు 40 ఎలక్ర్టిక్‌ బస్సులను నడుపుతున్న

Shamshabad ఎయిర్‌పోర్ట్‌కు కొత్త రూట్లలో ఆర్టీసీ..

హైదరాబాద్‌ సిటీ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు 40 ఎలక్ర్టిక్‌ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ కొత్తగా ఈసీఐఎల్‌, కొంపల్లి ప్రాంతాల నుంచి మరిన్ని బస్సులను నడపనుంది. గురు,శుక్ర వారాల్లో అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేసింది. జేబీఎస్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు 30 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉందని ప్రయాణికులు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్‌ డీఎం కృష్ణమూర్తి తెలిపారు. ఆర్టీసీ వెబ్‌సైట్‌ (tsrtc.telangana.gov.in) లో అన్ని రూట్ల బస్సుల వేళలు, స్టాప్‌ల వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-10-07T14:56:29+05:30 IST