కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నాయి: రేవంత్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-11-28T18:54:03+05:30 IST
తెలంగాణ కాంగ్రెస్ ఇందిరాపార్క్ దగ్గర చేపట్టిన దీక్ష రెండోరోజు ఆదివారం కొనసాగుతోంది.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఇందిరాపార్క్ దగ్గర చేపట్టిన దీక్ష రెండోరోజు ఆదివారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ వర్షా కాలం ధాన్యం కొనకుండా.. యాసంగి పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని రైతులు రాళ్లతో కొడతారన్నారు. ధైర్యముంటే సీఎం కేసీఆర్, హరీష్‌రావు, బండి సంజయ్, కిషన్‌రెడ్డి కల్లాల దగ్గరకు రావాలన్నారు. కాంగ్రెస్ నుంచి తాను, కోమటిరెడ్డి వస్తామన్నారు. రైతులు ఎవరిని చెప్పులు, చీపుర్లతో కొడతారో చూద్దామన్నారు. రైతు సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. హైకమాండ్‌తో చర్చించి జంతర్‌మంతర్ దగ్గర దీక్ష చేపడతామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.