రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-03-15T04:54:52+05:30 IST

హైదరాబాద్: రామకృష్ణ పరమహంస 186వ జయంతి( మార్చి 15) సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్: రామకృష్ణ పరమహంస 186వ జయంతి( మార్చి 15) సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం ఐదున్నరకు మంగళారతి, భజనలుంటాయి. ఉదయం 7 గంటలకు విశేష పూజలుంటాయి. పదింబావుకు హోమం, 11 గంటలా 15 నిమిషాలకు ప్రసంగాలుంటాయి. మధ్యాహ్నం పన్నెండున్నరకు విశేష హారతి ఉంటుంది. సాయంత్రం 6 గంటలా 45 నిమిషాలకు ఆరాత్రికం, 7గంటలా 15 నిమిషాల నుంచి భజనలుంటాయి. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో భక్తులు యూ ట్యూబ్ ద్వారా కార్యక్రమాలను వీక్షించాలని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు. 


రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ ఉంటుంది. భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని రామకృష్ణ మఠం ప్రతినిధులు సూచించారు. 

Updated Date - 2021-03-15T04:54:52+05:30 IST