వెబినార్ల ద్వారా ఉత్తేజపరుస్తున్న హైదరాబాద్ రామకృష్ణ మఠం వీఐహెచ్ఇ

ABN , First Publish Date - 2021-01-13T22:23:21+05:30 IST

స్వామి వివేకానంద.... యువతకే కాదు.. ప్రతి భారతీయుడికీ రోల్ మోడల్. దేశం, ధర్మం గురించి ఆలోచిస్తూనే, యువతపై

వెబినార్ల ద్వారా ఉత్తేజపరుస్తున్న హైదరాబాద్ రామకృష్ణ మఠం వీఐహెచ్ఇ

హైదరాబాద్: స్వామి వివేకానంద.... యువతకే కాదు.. ప్రతి భారతీయుడికీ రోల్ మోడల్. దేశం, ధర్మం గురించి ఆలోచిస్తూనే, యువతపై ఎక్కువగా దృష్టి సారించే వారు వివేకానంద. ఇదే పరంపరను ఇప్పటికీ ‘వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్సీ’’ సంస్థ కొనసాగిస్తోంది. యువతను దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు, అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కరోనా కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ విధించినా.... సామాజిక మాధ్యమాల ద్వారా యువతను చైతన్యపరిచేందుకు వివిధ వెబినార్లను నిర్వహిస్తున్నారు. ఈ వెబినార్లకు ఆయా రంగాల ప్రముఖులను ఆహ్వానించి విద్యార్థులకు మార్గదర్శనం ఇప్పించింది ఈ సంస్థ. ఇక... సమాజం నుంచి కూడా ఈ వెబినార్లకు చాలా స్పందన వస్తోంది. కేవలం పిల్లలే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఈ వెబినార్లలో పాల్గొంటుండటం విశేషం. ఈ వెబినార్లలో  భాగంగా ‘‘వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్సీ’’ ఈ క్రింది కార్యక్రమాలను నిర్వహించింది. 


1. ఆధునిక యుగంలో విద్య, నూతన కోణాలు

2. భారత పునరజ్జీవనం కోసం వ్యక్తిగతంగా రావాల్సిన పరివర్తన

3. పునరుజ్జీవన భారతం కోసం శారీరక, మానసిక దృఢత్వాన్ని సంపాదించడం ఎలా?

4. పునరుజ్జీవిత భారతంలో నారీశక్తి పాత్ర

5. భారతీయ సంస్కృతి, భారతీయ విద్యపై సమాలోచనలు

6. భారతీయ సంస్కృతిలో యువత

7. ఉత్తేజకర భారతావని కోసం వ్యక్తి కన్నా సేవే ముఖ్యం

8.  సమర్థ భారతంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర

9.సమర్థ భారత నిర్మాణంలో యోగా, ధ్యానం ఆవశ్యకత

10. యువ సంఘర్ష్ ఫైనల్స్

11. వివేకానంద మరియు యువ శక్తి

12. పారిశ్రామిక వేత్తలతో సమర్థ భారత నిర్మాణం చేయడం ఎలా?

13. సామాజిక సేవ ద్వారా సమర్థ భారత నిర్మాణం

14. సమర్థ భారత నిర్మాణానికి స్వామి వివేకానంద దృష్టికోణం

15. సమర్థ భారత నిర్మాణంలో అఖిల భారత సర్వీసు అధికారుల పాత్ర

16. క్విజ్ కార్యక్రమాలు


ప్రముఖంగా స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంస్థ మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ‘‘జాతి నిర్మాణం- సైన్స్ పాత్ర’’ అన్న అంశంపై వెబినార్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఈ రంగానికి సంబంధించిన ప్రముఖులు పాల్గొని, మార్గనిర్దేశనం చేశారు. దీనితో పాటు మరికొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.    


Updated Date - 2021-01-13T22:23:21+05:30 IST