కేసీఆర్‌ది దొంగ దీక్ష అని బీజేపీకి ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: పొన్నాల లక్ష్మయ్య

ABN , First Publish Date - 2021-12-28T20:51:02+05:30 IST

కేసీఆర్ చేసిన ఉద్యమ దీక్ష దొంగ దీక్ష అని బీజేపీకి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.

కేసీఆర్‌ది దొంగ దీక్ష అని బీజేపీకి ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్: కేసీఆర్ చేసిన ఉద్యమ దీక్ష దొంగ దీక్ష అని బీజేపీకి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం మరో ఉద్యమం చేస్తామని బీజేపీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విభజన చట్టం హామీలను కేంద్రం ఎంత వరకు అమలు చేసింది.. దాని గురించి రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడరని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచాలను కొవవడం సరికాదన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదనని విమర్శించారు. పిల్లలకు కరోనా టీకాపై ప్రభుత్వం ఆలస్యంగా మేలుకుందని, దేశంలో టీకా ఉత్పత్తి ఎక్కువగా ఉన్నా.. ఇంకా వంద శాతం టీకాలు ఇవ్వలేక పోయిందని, ఇది పూర్తిగా మోదీ వైఫల్యమని అన్నారు. టీచర్ల బదిలీలపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను ఒప్పించే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఇంటర్ పరీక్షల విషయంలో ప్రభుత్వం బుద్దిలేకుండా వ్యవహరించిందని పొన్నాల విమర్శించారు.

Updated Date - 2021-12-28T20:51:02+05:30 IST