జనవరి 1st నుంచి Numaish‌..

ABN , First Publish Date - 2021-12-30T12:13:51+05:30 IST

81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌)ను జనవరి..

జనవరి 1st నుంచి Numaish‌..

హైదరాబాద్ సిటీ/అఫ్జల్‌గంజ్ : 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌)ను జనవరి ఒకటి సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌, మంత్రులు హరీ‌ష్‌రావు, మహమూద్‌ అలీ తదితరులు ప్రారంభిస్తారని ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు. ఈ మేరకు బుధవారం సొసైటీ కార్యాలయంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతితో నుమాయిష్‌‌ను కొనసాగిస్తామని, 25 రోజులుగా మైదానంలో స్టాళ్ల ఏర్పాట్ల పనులను  చేస్తున్నామని తెలిపారు. గతేడాది కొవిడ్‌ కారణంగా నుమాయిష్‌‌ను నిర్వహించలేదన్నారు. ఈసారి నిబంధనలు పాటిస్తూ మైదానంలో కేవలం 1500 స్టాళ్లకు మాత్రమే అనుమతులు ఇచ్చామని ఆదిత్య మార్గం తెలిపారు. 

Updated Date - 2021-12-30T12:13:51+05:30 IST