సాంకేతిక సవాళ్లు అధిగమించేందుకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-12-25T15:51:45+05:30 IST

ఆధునిక యుద్ధభూమిలో వేగంగా మారుతున్న సాంకేతిక సవాళ్లను అధిగమించడానికి కేడెట్స్‌ నిరంతరం అవగాహన పెంచుకోవాలని భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాబాసాహెబ్‌ నీలకంఠ కళ్యాణి అన్నారు.

సాంకేతిక సవాళ్లు అధిగమించేందుకు కృషి చేయాలి

భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీలకంఠ కళ్యాణి


అల్వాల్‌/తిరుమలగిరి డిసెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఆధునిక యుద్ధభూమిలో వేగంగా మారుతున్న సాంకేతిక సవాళ్లను అధిగమించడానికి కేడెట్స్‌ నిరంతరం అవగాహన పెంచుకోవాలని భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాబాసాహెబ్‌ నీలకంఠ కళ్యాణి అన్నారు. శుక్రవారం తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ఎంసీఈఎంఈ) ఆడిటోరియంలో శత స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన ఆయన 102వ డిగ్రీ కోర్సు (డీఈ), 36వ టెక్నికల్‌ ఎంట్రీ స్కీం కోర్సులు పూర్తిచేసుకున్న 53 మంది గ్రాడ్యుయేషన్‌ అధికారులకు పట్టాలు అందజేశారు. అనంతరం కేడెట్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. కొవిడ్‌ ఉన్నప్పటికి కేడెట్స్‌కు సజావుగా శిక్షణ అందించడానికి ఎంసీఈఎంఈ చేసిన కృషి అభినందనీయమన్నారు. 


ఎంసీఈఎంతో ఫోర్జ్‌ సంస్ధకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. భవిష్యత్తులో మిలటరీ సాంకేతిక పరంగా ఎదుర్కోవలసిన సవాళ్లను అధిగమించేందుకు నూతన ఆవిష్కరణల కేంద్రాల ఏర్పాటుకు ఎంసీఈఎంఈ ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటుండడం అభినందనీయమని అన్నారు. ఎంసీఈఎంఈతో ఒప్పందం కుదుర్చుకున్న తమ సంస్థ ఇక్కడ ఈగిల్స్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అనంతరం ఆయా కోర్సుల్లో ప్రతిభ కనబరచిన కెప్టెన్‌అమో్‌ఘశర్మకు డీజీఈఎంఈ ట్రోఫీ, జీవోసీ-ఇన్‌-సి ఆర్‌ట్రాక్‌, బుక్‌ప్రైజ్‌తో పాటు కమాండెంట్స్‌ వెండి పతకాన్ని, లెఫ్టినెంట్‌ కె.సూరజ్‌కు జీవోసి-ఇన్‌-సి ఆర్‌ట్రాక్‌ ట్రోఫీ, బుక్‌ప్రైజ్‌, కెప్టెన్‌ ధీరజ్‌శర్మ, లెఫ్టినెంట్‌ కొట్టన అన్వే్‌షకుమార్‌కు డీజీఈఎంఈ బంగారు, కమాండెంట్స్‌ వెండి పతకాలు, లెఫ్టినెంట్‌ ఆర్‌.రిషబ్‌కుమార్‌కు కమాండెంట్స్‌ వెండి పతకాన్ని అందజేశారు. 

Updated Date - 2021-12-25T15:51:45+05:30 IST