హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలకు రంగం సిద్ధం
ABN , First Publish Date - 2021-12-31T18:43:20+05:30 IST
హైదరాబాద్: నగరంలో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. ఈవెంట్ ఆర్గనైజర్లు పార్టీలకు ఫ్లాన్ సిద్ధం చేశారు.
హైదరాబాద్: నగరంలో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. ఈవెంట్ ఆర్గనైజర్లు పార్టీలకు ఫ్లాన్ సిద్ధం చేశారు. పబ్బులు, క్లబ్‌లు, రిసార్ట్స్, రెస్టారెంట్లు.. ఇలా ఒకటేమిటి డిమాండ్‌కు తగ్గట్లుగా అన్నింటిని సిద్ధం చేశారు. కొత్త ఉత్సాహంతో సరికొత్త ఆఫర్లతో యువతను ఆకట్టుకుంటున్నారు.
కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు.. ఆ జోషే వేరు. ఉరిమే ఉత్సాహం.. అవధుల్లేని ఆనందం, స్నేహితులతో పార్టీలు, డ్యాన్సులు, విందులు అంటూ పబ్బుల్లో పార్టీలు, రిసార్ట్స్‌లో కుర్రకారు ఎంజాయ్ చేస్తుంటారు. గత ఏడాది కోవిడ్ కారణంగా ఏ హడావుడి లేకుండా పోయింది. ఈసారి మాత్రం ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నా.. ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చింది.