వేప చెట్టుకు వైరస్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..
ABN , First Publish Date - 2021-10-25T18:07:29+05:30 IST
వేప చెట్టుకు వైరస్ సోకింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ...

- కారణాలపై శాస్త్రవేత్తల పరిశోధనలు
హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్ : వేప చెట్టుకు వైరస్ సోకింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాలలో కూడా వేప చెట్టు కొమ్మలు పూర్తిగా ఎండిపోతున్నాయి. దీంతో రైతులు కిసాన్ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆగ్రో ఫారెస్ట్రీ విభాగం శాస్త్రవేత్తలు వేప చెట్టుకొమ్మలు ఎండిపోవడానికి గల కారణాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఇంకా ఫలితాలు రాలేదని, త్వరలోనే వేప కొమ్మలు ఎండిపోవడానికి గల కారణాలను రైతులకు వివరిస్తామని వారు తెలిపారు.