ఐఐటీలలోనే కాదు.. ఆఖరికి వర్సిటీలలోనూ: దాసోజు
ABN , First Publish Date - 2021-03-21T22:39:33+05:30 IST
దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్..

హైదరాబాద్: సిబ్బంది ఖాళీల భర్తీ విషయంలో రిజర్వేషన్ల నిబంధనలను ఐఐటీ కాలేజీలు ఉల్లంఘిస్తున్నాయంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. కేవలం ఐఐటీలలోనే కాదని, ఇఫ్లూ, హైదరాబాద్ యూనివర్సిటీ, నల్సార్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లాంటి అనేక విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ల స్ఫూర్తిని గాలికి వదిలేస్తున్నారని.. ఆఖరుకి వాటి అమలుకి జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్(ఎన్‌సీబీసీ) చేస్తున్న ప్రయత్నాలను ఇవి అడ్డుకుంటున్నాయంటూ ట్వీట్ చేశారు.