ఎంపీ రఘురామకి మిలటరీ ఆస్పత్రిలో చికిత్స
ABN , First Publish Date - 2021-05-21T18:34:01+05:30 IST
ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు మిలటరీ ఆస్పత్రిలోని అప్సర వార్డులో చికిత్స పొందుతున్నారు.

హైదరాబాద్: ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు మిలటరీ ఆస్పత్రిలోని అప్సర వార్డులో చికిత్స పొందుతున్నారు. మరికొద్దిసేపటిలో షీల్డ్ కవర్ ఓపెన్ చేసి నివేదికలు, వీడియో గ్రఫీని సుప్రీం కోర్టు పరిశీలించునుంది. ఆర్మీ వైద్యులు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకోనుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో రఘురామ కృష్ణ రాజు జ్యూడిషియల్ కష్టడీలో ఉన్నారు. రఘురామ బెయిల్ పిటిషన్‌పై కూడా కీలక సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోనుంది.