మొబైల్ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని పరిశీలించిన సీఎస్‌

ABN , First Publish Date - 2021-10-30T22:06:52+05:30 IST

రాజేంద్రనగర్‌లో మొబైల్ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని సీఎస్‌ సోమేష్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

మొబైల్ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని పరిశీలించిన సీఎస్‌

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో మొబైల్ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని సీఎస్‌ సోమేష్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా రెండో డోసు వ్యాక్సిన్‌ ప్రతిఒక్కరూ వేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే మూడు కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో 90 శాతం పౌరులకు వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తెలిపారు. నేటి నుంచి 10 రోజుల పాటు 150 మొబైల్ వ్యాక్సిన్‌ కేంద్రాల ఏర్పాటు చేస్తామని రిజ్వీ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-30T22:06:52+05:30 IST