15 నెలల తర్వాత పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

ABN , First Publish Date - 2021-06-22T17:28:00+05:30 IST

పదిహేను నెలల తర్వాత ఎంఎంటీఎస్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.

15 నెలల తర్వాత పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్‌ : పదిహేను నెలల తర్వాత ఎంఎంటీఎస్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈనెల 23 నుంచి రైళ్లను నడిపించడానికి దక్షిణ మధ్య రైల్వే యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మొదటి పది సర్వీసులను మాత్రమే నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 7.50 నుంచి రాత్రి 7.05 గంటల వరకు మాత్రమే రైళ్లు నడవనున్నాయి. 


23 నుంచి నడిచే ఎంఎంటీఎస్‌ సర్వీసులు 

- ఫలక్‌నుమా-లింగంపల్లి సర్వీస్‌ (47154) ఉదయం 7.50కి ఫలక్‌నుమా నుంచి బయల్దేరి, 9.07 గంటలకు లింగంపల్లి చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్‌కు ఉదయం 8.20కి  చేరుకుని, 8.22 గంటలకు తిరిగి బయల్దేరుతుంది. 

- లింగంపల్లి-ఫలక్‌నుమా సర్వీస్‌ (47178) ఉదయం 9.20కి లింగంపల్లి నుంచి బయల్దేరి, 10.42కి  ఫలక్‌నుమా చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్‌కు 10.10కి చేరుకుని, 10.1 2గంటలకు తిరిగి బయల్దేరుతుంది. 

- ఫలక్‌నుమా-లింగంపల్లి సర్వీస్‌ (47157) ఉదయం 10.55కి ఫలక్‌నుమా నుంచి బయల్దేరి, 12.12కి లింగంపల్లి చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్‌కు 11.30కి చేరుకుని, 11.32 గంటలకు తిరిగి బయల్దేరుతుంది. 

- లింగంపల్లి-ఫలక్‌నుమా సర్వీస్‌(47181) మధ్యాహ్నం 12.40కి లింగంపల్లి నుంచి బయల్దేరి 2 గంటలకు ఫలక్‌నుమా చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్‌కు 1.25కి చేరుకుని, తిరిగి 1.27 గంటలకు బయల్దేరుతుంది. 

- ఫలక్‌నుమా-లింగంపల్లి సర్వీస్‌(47162) సాయంత్రం 4.20కి ఫలక్‌నుమా నుంచి బయల్దేరి, 5.45కి లింగంపల్లి చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్‌కు 4.55కు చేరుకుని, తిరిగి 4.57గంటలకు బయల్దేరుతుంది. 

- లింగంపల్లి-ఫలక్‌నుమా సర్వీస్‌ (47188) సాయంత్రం 6.05కి లింగంపల్లి నుంచి బయల్దేరి, 7.32కి ఫలక్‌నుమా చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్‌కు 6.50కు చేరుకుని, తిరిగి 6.52 గంటలకు బయల్దేరుతుంది.

- లింగంపల్లి-హైదరాబాద్‌ సర్వీస్‌ (47131) ఉదయం 8.43కి లింగంపల్లి నుంచి బయల్దేరి, 9.28 గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది. 

- హైదరాబాద్‌-లింగంపల్లి సర్వీస్‌ (47107) ఉదయం 9.36కి హైదరాబాద్‌ నుంచి బయల్దేరి, 10.21 గంటలకు లింగంపల్లి చేరుతుంది. 

- లింగంపల్లి-హైదరాబాద్‌ సర్వీస్‌ (47141) సాయంత్రం 5.15కి లింగంపల్లి నుంచి బయల్దేరి, 6.05గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది. 

- హైదరాబాద్‌-లింగంపల్లి సర్వీస్‌ (47119) సాయంత్రం 6.15కి హైదరాబాద్‌ నుంచి బయల్దేరి, రాత్రి 7.05 గంటలకు లింగంపల్లి చేరుతుంది. 


నిబంధనలు పాటించాలి

ప్రయాణికులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. మాస్కులు ధరించాలని, రైల్వే స్టేషన్లలో భౌతికదూరం పాటించాలని, తరచూ శానిటైజ్‌ చేసుకోవాలని సూచించారు. Updated Date - 2021-06-22T17:28:00+05:30 IST