సంగీత దర్శకుడిపై MLA ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-12-19T15:52:21+05:30 IST

భక్తి పాటను ఐటం పాటగా మార్చి పాడిన సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. భక్తి పాటను

సంగీత దర్శకుడిపై MLA ఫిర్యాదు

హైదరాబాద్‌ సిటీ: భక్తి పాటను ఐటం పాటగా మార్చి పాడిన సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. భక్తి పాటను ఐటం సాంగ్‌ రూపంలో పాడి హిందువుల మనోభావాలను ఆయన దెబ్బ తీశారని.. హిందూ సమాజానికి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. హిందూ దేవుళ్లను చిన్న చూపు చూడటం కొందరికి అలవాటుగా మారిందని.. డబ్బు సంపాదన కోసం కొందరు హిందూ దేవుళ్లను అవమానిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాఖ్యలను మరొకరు చేయకుండా దేవీశ్రీ ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. 

Updated Date - 2021-12-19T15:52:21+05:30 IST