సాయిధరమ్ తేజ్‌ను పరామర్శించిన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2021-09-11T17:10:43+05:30 IST

రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు.

సాయిధరమ్ తేజ్‌ను పరామర్శించిన మంత్రి తలసాని

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ  వినాయకుడి దయవల్ల సాయిధరమ్ తేజ్‌కు ఎం కాలేదని,  త్వరలోనే కోలుకుంటారని అన్నారు. చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని తెలిపారు. హెల్మెట్, షూస్, జాకెట్  వేసుకోవడం వల్ల ఎం కాలేదని చెప్పారు. సాయి తేజ్‌పై అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు. వైద్యులు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. 

Updated Date - 2021-09-11T17:10:43+05:30 IST