నేటి నుంచే ఉచిత నీరు..
ABN , First Publish Date - 2021-01-12T12:31:51+05:30 IST
గృహ కనెక్షన్లకు నెలకు 20 వేల లీటర్ల నీళ్లను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు.

హైదరాబాద్: గృహ కనెక్షన్లకు నెలకు 20 వేల లీటర్ల నీళ్లను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు రెహ్మత్‌నగర్ డివిజన్‌లోని ఎస్‌పీఆర్ హిల్స్‌లో వాటర్‌బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. వినియోగదారులకు డిసెంబర్ నెలకు సంబంధించిన జీరో నీటి బిల్లులను అందివ్వనున్నారు. అధికంగా నీళ్లను వాడుకున్న వారికి 20 వేల లీటర్లను మినహాయించి బిల్లులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు.