వ్యవసాయ మార్కెట్లను కేంద్రం నిర్వీర్యం చేసింది: Harish

ABN , First Publish Date - 2021-12-25T17:47:28+05:30 IST

కేంద్రం వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసిందని మంత్రి హరీష్‌రావు విమర్శించారు.

వ్యవసాయ మార్కెట్లను కేంద్రం నిర్వీర్యం చేసింది: Harish

సిద్దిపేట: కేంద్రం వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసిందని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. శనివారం సిద్దిపేట మార్కెట్‌లో వర్మీ కంపోస్టు షెడ్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 4 కోట్ల ప్రజల భవిష్యత్తు, 70 లక్షల రైతుల ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లిన మంత్రులను పనిలేదంటూ కేంద్ర మంత్రులు హేళన చేశారన్నారు. ఆహార భద్రత అంశం కేంద్రం పరిధిలోనిదని తెలిపారు. ధాన్యం విషయంలో కేంద్రం తీరు సరికాదని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-12-25T17:47:28+05:30 IST