కరోనా, బ్లాక్ ఫంగస్‌పై మంత్రి హరీష్ సమీక్ష

ABN , First Publish Date - 2021-05-18T17:00:14+05:30 IST

కరోనా, బ్లాక్ పంగస్‌‌పై మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ బిఆర్కే భవన్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

కరోనా, బ్లాక్ ఫంగస్‌పై మంత్రి హరీష్ సమీక్ష

హైదరాబాద్: కరోనా, బ్లాక్ పంగస్‌‌పై మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ బిఆర్కే భవన్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడంపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేయడంపై దృష్టి సారించారు. రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్‌పై ఉత్పత్తి కంపెనీలతో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. ఆర్టీసీ, సింగరేణి, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్మీ ఆసుపత్రులను కోవిడ్ హాస్పిటల్స్‌గా మార్చడం, కరోనా విషయంలో తీసుకోవాల్సిన ఇతరత్రా అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 

Updated Date - 2021-05-18T17:00:14+05:30 IST