200 మామిడి మొక్కల పెంపకం

ABN , First Publish Date - 2021-12-26T17:26:09+05:30 IST

మామిడి కాయల్లోని జీడి పిక్కలు నాటి 200 మామిడి మొక్కలను పెంచిన విద్యార్థుల కృషిని మంత్రి గంగుల కమలాకర్‌ అభినందించారు. నిజాంపేటలో నివాసముండే రాము, ప్రవీణ

200 మామిడి మొక్కల పెంపకం

విద్యార్థులను అభినందించిన మంత్రి గంగుల 

హైదరాబాద్/కూకట్‌పల్లి: మామిడి కాయల్లోని జీడి పిక్కలు నాటి 200 మామిడి మొక్కలను పెంచిన విద్యార్థుల కృషిని మంత్రి గంగుల కమలాకర్‌ అభినందించారు. నిజాంపేటలో నివాసముండే రాము, ప్రవీణ దంపతుల కుమార్తెలు దిశిత(11), సహర్ష(7). బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో పనిచేసే రాము తరచూ ఇంటికి మామిడి కాయలు తెచ్చేవారు. సదరు మామిడి కాయలు తిన్నతర్వాత వాటిల్లోని జీడీ పిక్కలను టిష్యూ పేపర్లు, కవర్లలో పెట్టి మొలకలు వచ్చే వరకు దిశిత, సహర్ష  భద్రపరిచేవారు. మొలకలు వచ్చిన తర్వాత వాటిని కప్పులు, ప్లాస్టిక్‌ గ్లాసుల్లో వేసి మొక్కలుగా పెంచడం ప్రారంభించారు. ఇలా వీరిద్దరూ ఇప్పటివరకు 200 మొక్కలను పెంచారు. సదరు బాలికలు తల్లిదండ్రులతో కలిసి శనివారం మంత్రిని తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారి హరిత కృషిని మంత్రి అభినందించారు. 

Updated Date - 2021-12-26T17:26:09+05:30 IST