హైదరాబాద్‌‌లో మహదీయ మేకప్‌ స్టూడియో ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-10T04:19:29+05:30 IST

మహదీయ కంపెనీ తమ నూతన మేకప్‌ స్టూడియోను హైదరాబాద్‌‌లోని బంజారాహిల్స్‌‌లో ప్రారంభించింది.

హైదరాబాద్‌‌లో మహదీయ మేకప్‌ స్టూడియో ప్రారంభం

హైదరాబాద్‌: మహదీయ కంపెనీ తమ నూతన మేకప్‌ స్టూడియోను హైదరాబాద్‌‌లోని బంజారాహిల్స్‌‌లో ప్రారంభించింది. ఈ స్టూడియో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ, సూపర్‌స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత, నటుడు అలీ రెజా తదితరులు హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మహదీయ దర్వేష్‌ మాట్లాడుతూ ‘‘చిన్నతనం నుంచి నాకు మేకప్‌ అంటే ప్రత్యేక అభిమానం ఉండేది. నా కల నిజమైన రోజు ఇది. నా కల సాకారం కావడంలో మా నాన్న నాకు ఎంతగానో సహాయపడ్డారు. నా స్టూడియో తన గురించి తాను ఎంతగానో వెల్లడిస్తుంది. ఈ స్టూడియో గోడలు, డెకార్‌కు విలాసమే స్ఫూర్తి. ఈ మహదీయాస్‌ మేకప్‌ స్టూడియో ప్రధాన లక్ష్యం వినియోగదారులకు సంతృప్తినివ్వడం. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరి మోములోనూ చిరు నవ్వు చూడాలన్నది నా కోరిక. కలలకు వాస్తవ రూపాన్ని ఈ స్టూడియో అందిస్తుంది’’ అని తెలిపారు. ఈ స్టూడియోలో మేకప్స్‌, హెయిర్‌డూస్‌‌తో పాటు అన్ని రకాల డ్రేపింగ్స్‌, జ్యువెలరీ శైలి మొదలైనవి ఉన్నాయి.  వివాహం, పార్టీలు, పండుగలు మొదలైన సందర్భాల కోసం అత్యుత్తమ ఔట్‌ఫిట్స్‌, ఆభరణాల అవసరాలను కూడా అందించనుంది. ఇరాన్‌లోని మేకప్‌ సంస్కృతితో స్ఫూర్తి పొందిన మహదీయ, ఆ స్ఫూర్తిని ఇండియాకు తీసుకొచ్చింది. ఇతరులకు భిన్నంగా ఉండేలా ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శించాలని కోరుకుంటోంది.Updated Date - 2021-11-10T04:19:29+05:30 IST