ఎల్‌వీ ప్రసాద్ ఇనిస్టిట్యూట్‌కు విరాళం
ABN , First Publish Date - 2021-07-24T05:56:53+05:30 IST
నగరంలోని ‘ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్’కు శుక్రవారం ఇద్దరు అన్నదమ్ములు రూ.3.50 లక్షల విరాళం అందించారు.

బంజారాహిల్స్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ‘ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్’కు శుక్రవారం ఇద్దరు అన్నదమ్ములు రూ.3.50 లక్షల విరాళం అందించారు. హైటెక్‌సిటీలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న పడకంటి సుహ్రీత్, 8వ తరగతి చదువుతున్న సుధీతలు తాము దాచుకున్న డబ్బును తల్లిదండ్రులు శ్రీనివాసరావు, అపర్ణ సమక్షంలో ఎల్‌వీ ప్రసాద్‌లో కంటి ఆరోగ్య పరిశోధన కార్యకలాపాల నిమిత్తం అందజేశారు. కాగా, కొవిడ్ నేపథ్యంలో గతేడాది దినసరి కూలీలకు భోజనం అందించిన అక్షయ ఫౌండేషన్‌కు సుహ్రీత్ రూ.60 వేలు అందజేశారు.