ప్రేమ.. సహజీవనం.. పెళ్లి.. ఆత్మహత్యాయత్నం!

ABN , First Publish Date - 2021-05-30T18:41:24+05:30 IST

ఓ గది తీసుకొని సహజీవనం చేశారు. అదే గదిలో పెళ్లి

ప్రేమ.. సహజీవనం.. పెళ్లి.. ఆత్మహత్యాయత్నం!

  • ఇద్దరి మధ్య మనస్పర్థలు... ఒకరి మృతి


హైదరాబాద్/బంజారాహిల్స్‌ : వయసులో యువతి పెద్దది. అయినప్పటికీ వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకటి కావాలనుకున్నారు. ఓ గది తీసుకొని సహజీవనం చేశారు. అదే గదిలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంతలోనే మనస్పర్థలు రావడంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. యువకుడు మృతి చెందగా, యువతి గాయాలతో బయటపడింది. యూసుఫ్‌గూడ యాదగిరినగర్‌లో నివసించే బి. బాలాజీ (17) ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో ఉండే యువతి (20) పరిచయం అయింది. ఆ యువతి సినిమాల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఓ గది అద్దెకు తీసుకొని సహజీవనం మొదలు పెట్టారు. వారం రోజుల క్రితం గదిలోనే పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత మనస్పర్థలు తలెత్తాయి. యువతి తన కన్నా మూడేళ్లు పెద్దదనే ఆవేదన గొడవకు దారి తీసింది. ఇద్దరు కలిసి ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాలాజీ మరణించగా.. యువతి గాయాలతో బయటపడింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-30T18:41:24+05:30 IST