love failure అయిందని మనస్తాపం
ABN , First Publish Date - 2021-10-20T17:12:24+05:30 IST
ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. తాను తిరిగిరాని లోకానికి వెళ్లిపోతున్నానని స్నేహితుడికి మెసేజ్ చేసి సెల్‌ఫోన్

తిరిగిరాని లోకానికి వెళ్తున్నానని మిత్రుడికి మెసేజ్
హాస్టల్ నుంచి వెళ్లిపోయి ఫోన్ స్విచ్చాఫ్ చేసిన యువకుడు
హైదరాబాద్/అమీర్‌పేట: ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. తాను తిరిగిరాని లోకానికి వెళ్లిపోతున్నానని స్నేహితుడికి మెసేజ్ చేసి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఎస్ఆర్నగర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్జిల్లా, చెన్నారావుపేట మండలం, పాపయ్యపేట గ్రామం, జగ్గు తండాకు చెందిన ఆంగోత్ ప్రశాంత్(26) పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ఉద్యోగం నిమిత్తం నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. శ్రీనివాసనగర్ ఈస్ట్ ఎమ్కేఆర్ హాస్టల్లో ఉంటూ పేటీఎం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆమె ప్రశాంత్‌ను కలిసేందుకు ఇష్టపడడం లేదు. అతడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో ఈ విషయాన్ని మిత్రులకు చెప్పేవాడు. తనను మోసం చేసిందని మంగళవారం ఉదయం హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. యూసు్‌ఫగూడలో ఉంటున్న మిత్రుడు భూక్య సమ్మయ్యకు.. తాను తిరిగిరాని లోకానికి వెళ్లిపోతున్నానని మెసేజ్ చేశాడు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి కనిపించకుండాపోయాడు. సమ్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.