రూ. 7లక్షలు రుణం మంజూరైందని Whatsapp మెసేజ్.. కొద్దిసేపటికే ఫోన్ కాల్.. చివరికి..
ABN , First Publish Date - 2021-12-09T12:44:42+05:30 IST
రూ. 7లక్షలు రుణం మంజూరైందని Whatsapp మెసేజ్.. కొద్దిసేపటికే ఫోన్ కాల్.. చివరికి..

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్ : రుణం మంజూరైందని ఓ వ్యక్తి ఖాతా ఖాళీ చేశారు సైబర్ నేరగాళ్లు. కర్నూల్ జిల్లాకు చెందిన కె. రామచంద్రారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడి చికిత్స నిమిత్తం పది రోజుల క్రితం బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రికి వచ్చాడు. చికిత్స నిమిత్తం రుణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి ఫోన్ చేసి రూ. 7 లక్షల రుణం మంజూరైందని చెప్పాడు. రుణం మంజూరైనట్లు వాట్సా్ప్లో పత్రాలు పంపించాడు. ఇన్సూరెన్స్ కింద రూ. 6,125 కట్టాలని చెప్పాడు. ఆ తర్వాత మరో రూ. 21 వేలు కట్టమని కోరగా అతడు పంపించాడు. సైబర్ నేరగాడు మరోసారి ఫోన్ చేసి డబ్బులు అడగడంతో రామచంద్రారెడ్డికి అనుమానం వచ్చి తాను పంపించిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.