శిల్పాచౌదరీ, ఆమె భర్త ముందే Bank లాకర్ తెరవగా..!
ABN , First Publish Date - 2021-12-15T14:26:10+05:30 IST
శిల్పాచౌదరి, ఆమె భర్త శ్రీనివాస్‌ప్రసాద్ సమక్షంలో లాకర్ తెరిచారు. అందులో...

- ఒక రోజు కస్టడీ అనంతరం జైలుకు తరలింపు
హైదరాబాద్ సిటీ : చంచల్‌గూడ జైలు నుంచి మంగళవారం ఉదయం 10 గంటలకు శిల్పా చౌదరిని కస్టడీకి తీసుకొన్నారు. విచారణలో భాగంగా ఆమెను నార్సింగి పోలీసులు కోకాపేట్‌లోని యాక్సిస్ బ్యాంక్‌కు తీసుకెళ్లారు. శిల్పాచౌదరి, ఆమె భర్త శ్రీనివాస్‌ప్రసాద్ సమక్షంలో లాకర్ తెరిచారు. అందులో సొసైటీకి సంబంధించిన పత్రాలు లభించడంతో వాటిని పోలీసులకు సీజ్ చేశారు. ఎకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఖాతా స్టేట్ మెంట్‌ను పరిశీలించారు. బ్యాంక్ అధికారుల సహాయంతో ఎకౌంట్‌లో జరిగిన లావాదేవీల వివరాలన్నీ సేకరించారు.
ఇంకా బ్యాంకుకు రాని ఇతరులకు ఇచ్చిన చెక్కులు ఇతర ఆర్థిక వ్యవహారంలో దర్యాప్తు కొనసాగింది. అదే బ్యాంకులో ఆమె ఖాతాలో బ్యాలెన్స్ ఏమీ లేదు. లభించిన పత్రాల్లో ఓ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఉన్నట్లు సమాచారం. బంగారం, ఇతర విలువైన పత్రాలేవీ లేవని పోలీసులకు బ్యాంక్ అధికారులు వివరించారు. ఇతరుల నుంచి రూ.32కోట్లు తీసుకున్నట్లు ఇప్పటికే శిల్పాచౌదరీ పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. సాయంత్రం తిరిగి చంచల్‌గూడ జైలుకు ఆమెను పోలీసులు తరలించారు.