లక్డీకాపూల్‌లో అక్రమ వ్యాపారాలు.. ఆపై ఘర్షణలు

ABN , First Publish Date - 2021-12-31T20:47:54+05:30 IST

ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకొని చేస్తున్న అక్రమ వ్యాపారాలు లక్డీకాపూల్‌లో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు చేస్తున్నా ట్రాఫిక్‌ పోలీసులుగాని, జిహెచ్‌ఎంసి అధికారులుగాని పట్టించుకోవడం లేదు.

లక్డీకాపూల్‌లో అక్రమ వ్యాపారాలు.. ఆపై ఘర్షణలు

లక్డీకాపూల్‌ అమీతుమీకి సిద్దమైన రోడ్డు వ్యాపారులు

ఖైరతాబాద్‌ (హైదరాబాద్) డిసెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకొని చేస్తున్న అక్రమ వ్యాపారాలు లక్డీకాపూల్‌లో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు చేస్తున్నా ట్రాఫిక్‌ పోలీసులుగాని, జిహెచ్‌ఎంసి అధికారులుగాని పట్టించుకోవడం లేదు. అనుమతి లేకుండా ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు నిరహిఇఒంచడమే కాక అక్కడ స్థల విషయమై గత నాలుగైదు రోజులుగా కొందరి మధ్య ఘర్షణ జరుగుతుండడంతో అక్కడి వారు భయభ్రాంతులకు గురవుతున్నారు.  లక్డీకాపూల్‌ పాత రాజ్‌దూత్‌ హోటల్‌ చౌరస్తాలోని ప్రస్తుత హోటల్‌ వద్ద ఈ పరిస్థితి నెలకొంది. వాసవీ సేవాకేంద్రం వారికి సంబంధించిన దుకాణ సముదాయాల్లో ఉన్న ఓ హోటల్‌ను కొందరు అద్దెకు తీసుకొని దాంతో పాటు ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో వాహనాలను ఇక్కడ రోడ్డుపై పార్క్‌చేస్తుండగా తరచుగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి.  కొందరు రోడ్లపై చిరు వ్యాపారాలు చేసుకునే విషయమై తలెత్తిన గొడవ, హోటల్‌ వారు అడ్డుకుంటున్న నేపద్యంలో పెద్దగా మారడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై ట్రాఫిక్‌ పోలీసులు, జిహెచ్‌ఎంసి అధికారులు కల్పించుకొని ఫుట్‌పాత్‌ వ్యాపారాలనుపూర్తిగా తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఆమధ్యకాలంలో ఇదే తరహా ఫుట్‌పాత్‌ వ్యాపారాల విషయమై అమీర్‌పేటలో ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన నేపద్యంలో అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2021-12-31T20:47:54+05:30 IST