Kottapet: అశ్లీల నృత్యాల కలకలం
ABN , First Publish Date - 2021-10-13T15:30:23+05:30 IST
ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వార్షికోత్సవంలో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్హెచ్ఓ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ల్యాండ్
హైదరాబాద్/కొత్తపేట: ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వార్షికోత్సవంలో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్హెచ్ఓ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ల్యాండ్ మార్క్ రియల్ ఎస్టేట్ కంపెనీ 5వ వార్షికోత్సవాన్ని సోమవారం రాత్రి నాగోల్‌లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించింది. ఈ వేడుకల్లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారని సమాచారం అందడంతో ఎల్బీనగర్ పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. నిర్వాహకుడు రవీందర్‌రెడ్డి, ఈవెంట్ ఆర్గనైజర్ వరదరాజన్, డీజే ఆపరేటర్ కడారి దిలీ్పకుమార్లను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.