అల్మారా వెనకాల చిక్కుకుపోయిన చిన్నారి

ABN , First Publish Date - 2021-02-26T19:08:18+05:30 IST

తల్లిదండ్రులను ఆట పట్టించాలనుకున్న నాలుగేళ్ల చిన్నారి తమ ఇంట్లోని

అల్మారా వెనకాల చిక్కుకుపోయిన చిన్నారి

  • తప్పిపోయిందని తల్లిదండ్రుల ఫిర్యాదు


హైదరాబాద్/బోయినపల్లి : తల్లిదండ్రులను ఆట పట్టించాలనుకున్న నాలుగేళ్ల చిన్నారి తమ ఇంట్లోని అల్మారా వెనకాలకు వెళ్ళి ఇరుక్కుపోయింది. ఈ సంఘటన బోయిన్‌పల్లి పోలీ్‌సస్టేన్‌ పరిధిలో చోటుచేసుకుంది.  ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... న్యూబోయిన్‌పల్లి ఓల్డ్‌ ఎయిర్‌పోర్టు రోడ్డులోని మౌంట్‌ కార్మెల్‌ హైస్కూల్‌ సమీపంలో నివసించే ఫెరోజ్‌ఖాన్‌ ప్రైవేటు ఉద్యోగి. అతని కుమార్తె సఫా (4) గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులను ఆట పట్టించాలనుకుని ఇంట్లోని అల్మారా వెనకాలకు వెళ్ళి అక్కడే ఇరుక్కుపోయింది. సఫా ఇంట్లో కనిపించకపోవడంతో హైరానాపడిన ఫెరోజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పెట్రోలింగ్‌ వాహనాల సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి నేతృత్వంలోని పోలీసుల బృందం ఫెరోజ్‌ ఇంట్లో పరిశీలించగా చిన్నారి అల్మారా వెనకాల చిక్కుకుపోయినట్లు గుర్తించారు. చిన్నారిని బయటకుతీసి తల్లిదండ్రులకు అప్పగించారు.

Updated Date - 2021-02-26T19:08:18+05:30 IST