మూగ, చెవుడు సమస్యలున్న పిల్లలకు ఉచితంగా ఖరీదైన వైద్యం

ABN , First Publish Date - 2021-08-27T21:10:41+05:30 IST

హైదరాబాద్: మూగ, చెవుడు సమస్యలు ఉన్న పిల్లలకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందిస్తున్న స్వచ్చంధ సంస్థ సక్షం నిలోఫర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తోంది.

మూగ, చెవుడు సమస్యలున్న పిల్లలకు ఉచితంగా ఖరీదైన వైద్యం

హైదరాబాద్: మూగ, చెవుడు సమస్యలు ఉన్న పిల్లలకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందిస్తున్న స్వచ్చంధ సంస్థ సక్షం.. నిలోఫర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తోంది. నవజాత శిశువులు మూగ, చెవుడు పొందే అవకాశం ఉందా అని తెలుసుకునేందుకు సక్షం సిబ్బంది మూడు స్థాయిల్లో ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరికి ఉచితంగా వినికిడి పరికరాలను ఇచ్చారు. వినికిడి పరికరాలు పొందిన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు వినడం, మాట్లాడటం అనే నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. ఈ నెల 27,28,29 తేదీల్లో ఈ శిక్షణ కొనసాగనుంది. సమస్యలు ఉన్న వారు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలలోపు నిలోఫర్ చిన్న పిల్లల ఆసుపత్రి కేంద్రానికి రావాలని సక్షం ప్రతినిధులు డాక్టర్ సంతోష్ కుమార్, లక్కరాజు కాశీనాధ్  సూచించారు. సమస్యలున్నవారు సంప్రదించాల్సిన నెంబర్ 8666086633. 


Updated Date - 2021-08-27T21:10:41+05:30 IST