HYD : పెళ్లి కావడం లేదని Kadapa జిల్లా వ్యక్తి ఆత్మహత్య!
ABN , First Publish Date - 2021-10-28T14:17:43+05:30 IST
పని ఎక్కువగా ఉందని, ఇక్కడే పడుకుని తెల్లారిన తర్వాత వస్తాన..

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్ : పెళ్లి కావడం లేదని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన ఓబులమ్మ కుటుంబం ఉప్పల్‌లో నివసిస్తోంది. ఆమె కుమారుడు సి.నర్సింహులు(38) హిమాయత్‌నగర్‌లోని శ్రీబాలాజీ డయాగ్నస్టిక్ సెంటర్లో నాలుగేళ్లుగా ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి తన తల్లికి ఫోన్ చేసిన నర్సింహులు పని ఎక్కువగా ఉందని, ఇక్కడే పడుకుని తెల్లారిన తర్వాత వస్తానని చెప్పాడు. సెంటర్లో పనిచేసేవారంతా వెళ్లిపోయిన తర్వాత గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
బుధవారం ఉదయం సెంటర్‌కు వచ్చిన తోటి ఉద్యోగులు నర్సింహులు విగతజీవిగా ఉండటం చూసి వెంటనే నారాయణగూడ పోలీసులకు, సెంటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అందజేశారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు.