హైదరాబాద్‌‌లో ఐవీఆర్‌ రిలీఫ్‌ డ్రాప్స్‌ తయారీ

ABN , First Publish Date - 2021-02-08T16:34:27+05:30 IST

బాలానగర్‌ పారిశ్రామికవాడకు చెందిన క్లైన్స్‌హర్బల్‌ సంస్థ ప్రయోక్లీన్‌ పేరుతో

హైదరాబాద్‌‌లో ఐవీఆర్‌ రిలీఫ్‌ డ్రాప్స్‌ తయారీ

హైదరాబాద్/బాలానగర్‌ : బాలానగర్‌ పారిశ్రామికవాడకు చెందిన క్లైన్స్‌హర్బల్‌ సంస్థ ప్రయోక్లీన్‌ పేరుతో ఐవీఆర్‌ రిలీఫ్‌ డ్రాప్స్‌ను తయారు చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఆయూష్‌ విభాగం ద్వారా అనుమతి పొంది డ్రాప్స్‌ను మార్కెట్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రయోక్లీన్‌ ఐవీఆర్‌ రిలీఫ్‌ డ్రాప్స్‌లో 16 ఆయుర్వేద వనమూలికల నూనెలను వినియోగించినట్లు సంస్థ నిర్వాహకురాలు సైంటిస్ట్‌ రశ్మీ తెలిపారు. ఈ డ్రాప్స్‌ను వాడడం వల్ల ఇమ్యూనిటీ పెరగుతుందని ఆమె చెప్పారు. దీంతో తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, గొంతునొప్పి, గొంతులో గరగర లాంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చునని ఆమె వివరించారు. దీనిని అన్ని వయస్సుల వారు అన్ని సీజన్‌లలో వాడవచ్చునని, ధర కూడా తక్కువేనని ఆమె వివరించారు.

Updated Date - 2021-02-08T16:34:27+05:30 IST