HYD : ఆదివారమూ ఇంటర్ ఫస్టియర్ పరీక్ష..
ABN , First Publish Date - 2021-10-29T14:37:22+05:30 IST
ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష ఈనెల 31న (ఆదివారం) కూడా నిర్వహిస్తున్నట్లు..

హైదరాబాద్ సిటీ : ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష ఈనెల 31న (ఆదివారం) కూడా నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ వడ్డెన్న ఓ ప్రకటనలో తెలిపారు. నిర్ణీత టైంటేబుల్ ప్రకారం ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1 పరీక్షలు యథావిధిగా ఉంటాయని, ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు. కాగా, గురువారం మొత్తం 43,538 మంది విద్యార్థులకు గాను 1425 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.