హైదరాబాద్ ఫారెన్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

ABN , First Publish Date - 2021-06-06T04:05:27+05:30 IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఫారెన్ బయోడైవర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో 4వ తేదీ శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని..

హైదరాబాద్ ఫారెన్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

హైదరాబాద్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఫారెన్ బయోడైవర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో 4వ తేదీ శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐఎఫ్ఎస్ డైరెక్టర్ డాక్టర్ రత్నాకర్ జౌహరి ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగానే నేడు(శనివారం) వెబినార్‌ నిర్వహించారు. ఈ వెబినార్‌లో ఏపీ బయోడైవర్సిటీ బోర్డ్ చైర్మన్ బీఎంకే రెడ్డి, రిటైర్డ్ డీజీపీ, ప్యూర్ ఎర్త్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎంవీ క్రిష్ణ, హైదరాబాద్ ఏడీఆర్ఐఎన్ రిటైర్డ్ డైరెక్టర్ డాక్టర్ వీ రఘు వెంకట్‌రమణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతల వివరాలను వెల్లడించారు.

Updated Date - 2021-06-06T04:05:27+05:30 IST