హకీం టూంబ్‌ ప్రహరీని కూల్చేసిన దుండగులు

ABN , First Publish Date - 2021-12-26T17:43:44+05:30 IST

పురాతన హకీం టూంబ్‌కు చెందిన ప్రహరీని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు. హకీంపేటలోని పురాతన హకీం టూంబ్‌

హకీం టూంబ్‌ ప్రహరీని కూల్చేసిన దుండగులు

హైదరాబాద్/బంజారాహిల్స్‌: పురాతన హకీం టూంబ్‌కు చెందిన ప్రహరీని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు. హకీంపేటలోని పురాతన హకీం టూంబ్‌ చుట్టూ ప్రహరీ ఉంది. ఈ నెల 23న రెవెన్యూ అధికారులు అక్కడే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లగా టూంబ్‌కు ఉన్న ప్రహరీ కూలి ఉంది. ఆరా తీయగా గుర్తు తెలియని వారు కూల్చివేసినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పురావస్తు శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-26T17:43:44+05:30 IST