టిప్పు ఇవ్వరా అంటూ.. యువకులను చితకబాదిన వెయిటర్

ABN , First Publish Date - 2021-12-15T15:45:02+05:30 IST

టిప్పు విషయంలో యువకులను వెయిటర్ చితకబాదిన ఘటన శంషాబాద్‌లో చోటు చేసుకుంది.

టిప్పు ఇవ్వరా అంటూ.. యువకులను చితకబాదిన వెయిటర్

హైదరాబాద్: టిప్పు విషయంలో యువకులను వెయిటర్ చితకబాదిన ఘటన శంషాబాద్‌లో చోటు చేసుకుంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్ పోర్ట్ బావర్చి హోటల్‌లో బిర్యానీ తినేందుకు వచ్చిన స్థానిక యువకులపై వెయిటర్ దాడి చేశాడు. బిర్యానీ తిన్న తర్వాత బిల్ చెల్లించి వెళ్తున్న యువకులను తనకు టిప్పు ఇవ్వరా..? అని వెయిటర్ అడిగాడు. యువకులు ఇవ్వకపోవడంతో రెచ్చిపోయిన వెయిటర్... యువకులను చితకబాదాడు. హోటల్ యజమాన్యం కూడా యువకులపై దాడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని యువకులను సముదాయించారు. కాగా గతంలో కూడా ఈ హోటల్‌పై పలు రకాల ఆరోపణలు వచ్చాయి. ఎయిర్ పోర్ట్ బావర్చి హోటల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-12-15T15:45:02+05:30 IST