దుర్గేష్ మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి: కుటుంబ సభ్యులు

ABN , First Publish Date - 2021-11-26T15:35:23+05:30 IST

నగరంలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రిషియన్ దుర్గేష్ అనుమానాస్పద మృతి కుటుంబసభ్యులు స్పందించారు.

దుర్గేష్ మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి: కుటుంబ సభ్యులు

హైదరాబాద్: నగరంలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రిషియన్ దుర్గేష్ అనుమానాస్పద మృతిపై కుటుంబసభ్యులు స్పందించారు. దుర్గేష్ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని అక్క అరుణ అన్నారు. దుర్గేష్ మృతిపై ఇద్దరు వ్యక్తుల మీద కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఎలా చనిపోయాడు అన్న విషయాలు పోలీసులు తమకు ఏమీ చెప్పలేదని.. ఎక్కడ చనిపోయాడు కూడా తమకు తెలీదన్నారు. రోజులానే ఇంట్లో ఉండి పనికి బయటకి వెళ్ళాడన్నారు. గతంలో రమణ అనే అమ్మాయిని దుర్గేష్ ప్రేమించాడని... ఆ అమ్మాయి 8 నెలల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్పారు. అమ్మాయితో మాట్లాడొద్దు అని పలు మార్లు దుర్గేష్‌ని దేవా, సురేష్ హెచ్చరించారని అన్నారు. యువతి ఆత్మహత్య కేసుకి సంబంధించి 17 రోజుల పాటు దుర్గేష్ జైలుకి వెళ్లొచ్చినట్లు తెలిపారు. చనిపోయిన అమ్మాయికి దేవా, సురేష్ కూడా పరిచయం ఉన్నట్లు చెప్పారు. దేవా, సురేష్ కలిసి దుర్గేష్‌ని చంపేసి ఉంటారని అని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-11-26T15:35:23+05:30 IST