పంజాగుట్ట చిన్నారి హత్య కేసులో పురోగతి

ABN , First Publish Date - 2021-11-09T17:37:28+05:30 IST

పంజాగుట్ట చిన్నారి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

పంజాగుట్ట చిన్నారి హత్య కేసులో పురోగతి

హైదరాబాద్: పంజాగుట్ట చిన్నారి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదేళ్ల చిన్నారిని బెంగళూరులో హత్య చేసి హైదరాబాద్‌లో పడేసినట్లు అనుమానిస్తున్నారు. ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట ప్రాంతాల్లో ఓ పాతబడిన షెటర్ వద్ద చిన్నారి మృతదేహాన్ని దుండగులు పడేశారు. పాప మృతదేహాన్ని పంజాగుట్ట వద్ద పడేసిన నిందితులు ఆపై మెహిదీపట్నం వైపు నడుచుకుంటూ వెళ్లినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ముగ్గురు అనుమానితుల్లో ఒక మహిళ ఉన్నట్లు గుర్తించారు. 


Updated Date - 2021-11-09T17:37:28+05:30 IST