Hyderabad: గాజులరామారంలో భారీ చోరీ
ABN , First Publish Date - 2021-10-25T16:28:57+05:30 IST
నగరంలోని జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధి గాజులరామారం గల విఎస్ఆర్ అపార్ట్మెంట్లో భారీ చోరీ జరిగింది.

హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధి గాజులరామారం గల వీఎస్ఆర్ అపార్ట్మెంట్లో భారీ చోరీ జరిగింది. సాయి మాధవి అనే మహిళ తన బంధువుల ఇంటికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లడంతో చోరీ జరిగింది. దాదాపు 65 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈనెల 11న ఎల్బీనగర్ వెళ్లిన సాయిమాధవి అనంతరం 22న ఇంటికి వచ్చింది... 24న బంగారు ఆభరణాలు చూసుకోగా అందులో ఆభరణాలు లేకపోవడంతో కంగుతున్న మహిళ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.