ఇంటికి వెళ్తామనుకోలేదు.. : ఉత్తరాఖండ్‌ వరద బాధితురాలు

ABN , First Publish Date - 2021-10-21T13:25:53+05:30 IST

‘తెల్లవారుజామునుంచి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూనే ఉన్నాం...

ఇంటికి వెళ్తామనుకోలేదు.. : ఉత్తరాఖండ్‌ వరద బాధితురాలు

హైదరాబాద్ సిటీ/మల్కాజిగిరి : ‘తెల్లవారుజామునుంచి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూనే ఉన్నాం. ఈ వరద తగ్గుతుందా.. మనం బయటపడతామా.. తిరిగి మన వారిని కలుసుకుంటామా అనే ఆలోచనలు మమ్మల్ని కలిచివేశాయి. కరెంట్‌ లేదు.. మంచినీరు లేదు. తినడానికి ఏమీ లేదు.. వరండాలోనే వరద ప్రవాహాన్ని చూస్తూ బిక్కుబిక్కుమంటూ ఉన్నాం. డ్యామ్‌ గేట్లు మూసివేయడంతో వరద తగ్గుముఖం పట్టడంతో ఆప్పుడు ఊపిరి పీల్చుకున్నా’మని బుధవారం ఇంటికి చేరుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సుష్మ ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న ఆమె వరద బీభత్సంపై తన అనుభూతిని వివరించింది. సోమవారం ఉదయం లెమన్‌ ట్రీ ప్రాంతంలోని జిమ్‌ కార్బెట్‌ పార్కును చూడాలనుకున్నామని.. అంతలోనే వరదలు తాము బసచేసిన లాడ్జీని చుట్టుముట్టాయని వివరించారు. అయితే మా కాలనీ వాసులు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు సమాచారం ఇచ్చారనీ.. వారి చొరవ వల్లే మేమంతా తిరిగి రాగలిగామని అన్నారు.  ఎమ్మెల్యే మైనంపల్లి స్వయంగా తనతో ఫొన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని అన్నారు.

Updated Date - 2021-10-21T13:25:53+05:30 IST